28-01-2026 12:39:18 AM
మున్సిపల్ ఎన్నికల వార్ రూమ్ ఇన్‌చార్జ్‌గా గుత్తా అమిత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) : పీసీసీ ఓబీసీ రాష్ట్ర చైర్మన్‌గా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. కన్వీనర్స్‌గా కేతూరి వెంకటేశ్, జూలురు ధనలక్ష్మిని నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల వార్ రూమ్ ఇన్‌చార్జ్‌గా గుత్తా అమిత్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.