28-01-2026 12:28:37 AM
కరీంనగర్, జనవరి 27 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 31న సాయం త్రం వరకు పరిశీలన అనంతరం జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడు వు ఉంటుంది. 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తారు.
ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సా యంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉం టుంది. ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఇబ్బందులెదురైనప్పుడు 12న తిరిగి రీ పోలింగ్ ని ర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇదే రోజు తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఎ న్నికల కోడ్ మంగళవారం నుండి అమలులోకి వచ్చింది. బుధవారం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇదే రోజు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, రెండు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి.
కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ బీసీ జనరల్ కు రిజర్వ్ కాగా చొప్పదండి, హుజూరాబాద్ ఎస్సీ మహిళ, జమ్మికుంట ఎస్సీ జనరల్ కు కేటాయించారు. అలాగే రాజన్న సిరసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ జనరల్ కు దక్కింది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల మున్సిపాలిటీ బీసీ మహిళ, కోరుట్ల జనరల్ మహిళ, రాయికల్ జనరల్, మెట్ పల్లి జనరల్, ధర్మపురి జనరల్ మహిళ, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీల చైర్మన్ పదవులు బీసీ జనరల్, సుల్తానాబాద్ జనరల్ కు దక్కాయి.
రామగుండం నగరపాలక సంస్థ ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అయింది. ఆయా మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ పదవులతోపాటు కార్పొరేటర్, కౌన్సిలర్ ప దవులు ఆశిస్తున్నవారు టికెట్ల కోసం పార్టీలు మారుతూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ము న్సిపాలిటీల్లో జెండా ఎగురవేయాలని ప్రధా న పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎంఐఎం కూడా 10కిపైగా డివిజన్లలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా డివిజన్లలో ఆశావహులు నేటి నుండి నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.