28-01-2026 12:39:07 AM
పూర్వవైభవం కోసం ఆరాటం
34 వార్డుల్లో పోటీకి సై
స్థానికతపై పట్టుకోసం ఎన్నికలే వేదిక
బెల్లంపల్లి జనవరి 27: ‘పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలన్నట్టు’ గులాబీపార్టీ పుర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. చేజారిన పురపాలన పగ్గాలను తిరిగి సాధించుకోవ డం కోసం మాస్టర్ ప్లాన్‌తో ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రంగంలోకి దూకుతుంది. మున్సిపాలి టీలోని 34 వార్డుల్లో బలమైనా, ప్రజల్ని ప్రభావితం చేసే యువకులను అభ్యర్థులుగా పోటీ లోకి దింపనున్నట్లు సమాచారం.
2023 శాసనసభ ఎన్నికల్లో పరాభవానికి గురైన బీఆర్‌ఎస్ స్థానిక ఎన్నికలను పూర్వవైభవం తెచ్చుకోవడానికి ప్రతిష్టాత్మకంగా భావి స్తున్నదనీ విశ్లేషకులు అంటున్నారు. స్థానిక ఎన్నికలు సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నికల అంకంతో స్థానిక పోరు మొదలైంది. దాని కొనసాగింపుగా.. మరో స్థానిక ఎన్నికలు రానే వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ సాధించిన ఫలితాలు, అధికార పార్టీకి ఇచ్చిన గట్టిపోటీ రాజకీయ భవిష్యత్తుకు ఆశాజనకంగా గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. మున్సి పల్ ఎన్నికల్లో మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. అందుకోసం వ్యూహ ప్రతి వ్యూహాల్లోనూ.. బీఆర్‌ఎస్ బిజీగా ఉంది. బలమైన గెలుపు గుర్రాలు అందుకు ప్రధాన ఆయుధాలుగా ఎంచుకుంటున్నది.
కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ పనితీరు పట్ల సహజంగానే కొంత అసంతృప్తులు, అసమ్మతులు, విమర్శలను మూటకట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణుల్లోనే అభిప్రాయాలున్నాయి. స్థానికంగా ఎమ్మెల్యే ఉండకపోవడం, అతని పీఏల పనితీరుకు తోడు కాంగ్రెసులోని సీనియర్లను పట్టించుకోవడం లేదని అసంతృప్తులు ఆయనను విమర్శలకు గురిచేశాయి. ఈ గ్యాప్‌ను కూడా ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఎన్నికల్లో పై చేయి సాధించటానీకి ప్రయత్నిస్తోంది. అయితే అది అంత సులువుగా జరిగే పని కాద నీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకాలంగా బీఆర్‌ఎస్ ప్రేక్షక పాత్రలో ఉండ టం కూడా కొంత మైనస్‌గా ఆ పార్టీకి లేకపోలేదు.
హస్తం, గులాబీ మధ్యనే పోరు..
మారిన రిజర్వేషన్ల నేపథ్యంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో కొత్త అభ్యర్థులే అన్ని పార్టీలకు దిక్కయ్యారు. ప్రధాన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు జనరంజకమైన, సమర్థవంతమైన అభ్యర్థుల వేటలో ఉన్నాయి. కొన్ని వార్డుల్లో అభ్యర్థుల కొరత కూడా ఇరు పార్టీలకు ఇబ్బందికరంగా పరిణమించింది. మున్సిపల్ ఎన్నిక ల్లో నువ్వా నేనా అనే రీతిలో తలపడే పరిస్థితి ఈ రెండు పార్టీల మధ్యనే కనిపిస్తోంది. ఎలాం టి పరిస్థితులు ఎదురైన గట్టి పోటీ ఇచ్చి, మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని పురపాలన పగ్గాలను తిరిగి చేపట్టాలన్నదే బీఆర్‌ఎస్ ప్రధా న టార్గెట్‌గా కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ దిశగా అభ్యర్థుల జాబితాను ఇప్పటికే రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది.
అధికార పార్టీపై స్థానికంగా తలెత్తిన వ్యతిరేకత, ఎమ్మెల్యే గడ్డం వినోద్ రాజకీయ, వ్యవహారిక బలహీనతలు మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పై ప్రభావం చూపే పరిస్థితీ కనిపిస్తోంది. ఈ అసంతృప్తి బీఆర్‌ఎస్‌కు ఏ మేరకు లాభిస్తాయో? బిఆర్‌ఎస్ పట్ల ప్రజల ఆదరణ ఈ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో నిలబెడుతుందోనన్నది ఆసక్తిగా మారింది. ఒకటి మాత్రం నిజం. ఈ ఎన్నికలు అటు ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఇటు బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు రాజకీయంగా జీవన్మరణమని పరిశీలకులు భావిస్తున్నారు.