calender_icon.png 28 January, 2026 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టికెట్ల కోసం నేతల కుస్తీ!

28-01-2026 12:41:17 AM

మోగిన మున్సిపల్ ఎన్నికల గంట

నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ

నిర్మల్, జనవరి 27 (విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల గంట మోగించింది. ఎన్నికల కోడ్ అమలు చేయడమేకుండా ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియ బుధ వారంతో ప్రారంభమై వచ్చేనెల 13న ఎన్నికల ఫలితాలతో ముగిసే విధంగా షెడ్యూలు ఖరారైంది.  దీంతో జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది.

నిర్మల్ జిల్లా లో నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీ లు ఉండగా నిర్మల్ జనరల్ మహిళకు ఖానాపూర్  భైంసా మున్సిపాలిటీలను జనరల్ కు కేటాయించారు. నిర్మల్ మున్సిపాలిటీలో మొ త్తం 42 వార్డులు, బైంసాలో 26 ఖానాపూర్ లో 12 వార్డులు ఉండగా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ స్థానాలను అధికారికంగా ప్రకటించారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 1,69,285 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నిర్మల్‌లో 42 వార్డులు, బైంసాలో 26, ఖానాపూర్‌లో 12 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

పార్టీలు హైడ్రామా.. అభ్యర్థుల్లో టెన్షన్

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పార్టీలో హైడ్రామా నెలకొనగా పోటీ చేసే అభ్యర్థులు టెన్షన్ పరమమైంది. మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి భారత రాష్ట్ర సమితి ఎంఐఎం ప్రధాన పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ కమ్యూనిస్టులు జనసేన తదితర పార్టీలు ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మార్గుండా యోగిత పేరును అధికారికంగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు అప్పల గణేష్ చక్రవర్తి పేరు ఖరారైంది. ఇక సెట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నిర్మల్‌లో బిజెపి అభ్యర్థిత్వంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలో అక్కడ  సెట్టింగ్ ఎమ్మెల్యేలు రామారావు పటేల్, బొజ్జు పటేల్ మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకునేందుకు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. కాంగ్రెస్ బిజెపిలో ఆశావాదులు ఎక్కువగా ఉండటంతో ఒక్కొక్క వార్డు నుంచి నలుగురు పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు అయితే నామినేషన్ల ప్రక్రి య బుధవారం నుండి ప్రారంభ కాలు నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలో ప్రతిష్ట నెలకొంది. ఇప్పటికే ఆయా వార్డుల్లో తమకి టికెట్లు వస్తాయన్న ధీమతో పార్టీ అభ్యర్థులు ప్రచారం కూడా చేపడుతున్నారు. అయితే ఇందులో ఎవరికి బీఫామ్ వస్తే వారే ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. నామినేషన్ల ప్రక్రియ మూడు రోజుల్లో మిగిలి ఉన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల అంశం పార్టీలకు కీలకంగా మారే అవకాశం ఉంది. 

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

రాష్ట్ర ఎన్నికలకు సంఘం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించడంతో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టున్నారు ఈనెల 20 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, 31 31న పరిశీలన చేపట్టనున్నారు. 1న తప్పుడు నామినేషన్ల రిజెక్ట్ చేయనున్నారు. వచ్చేనెల 2న అప్పిల్ అవకాశం అవకాశం కల్పించారు. 3 న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు సాయంత్రం పోటీచేసే అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. 11న కౌం టింగ్ నిర్వహించి 13న ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతం గా నిర్వహించుకునేందుకు అన్ని శాఖ ల సమన్వయంతో జిల్లా అధికారులు చర్య లు ప్రారంభించారు.