calender_icon.png 31 August, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇవేం గుర్తుకు రాలేదా

30-08-2025 05:58:40 PM

బిఆర్ఎస్ నేతలకు డాక్టర్ కోట నీలిమ సూటి ప్రశ్న..

సనత్‌నగర్ (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమావేశాల్లో తమకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని స్పీకర్ ను కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(Constituency In-charge Dr. Kota Neelima) కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ.. గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పలుమార్లు పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అప్పటి స్పీకర్ ను అనుమతి కోరినా రిజెక్ట్ చేశారని గుర్తు చేశారు. అప్పుడు అనుమతి ఇవ్వకుండా ఇప్పుడు మీరు అనుమతి అడగడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, అవకతకవకలపై 2024 మార్చిలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో భాగంగా 115 మందిని విచారించి సాక్ష్యాలను నమోదు చేసింది. విజిలెన్స్, NDSA నివేదికలను కూడా విశ్లేషించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రానుందని తెలిపారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ వైఖరి బయటపడుతుందన్నారు. బ్యారేజీల లొకేషన్ల ఎంపిక, నిర్మాణం, నిర్ణయాల నుంచి డ్యామేజీల వరకు అన్ని ఆధారాలతో సహా ఈ అసెంబ్లీ సెషన్ ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా నిరోధించాలని బిఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం సిగ్గుచేటన్నారు.