31-08-2025 03:39:54 PM
హైదరాబాద్: కేరళలోని అలప్పుజలో ఎంపీ మెరిట్ అవార్డ్-2025 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాంలో సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్.. పేదలు, అణగారినవర్గాల బాగు కోసం పోరాడుతున్నారని అన్నారు. అణిచివేతకు, అన్యాయానికి గురయ్యేవారి తరపున ప్రశ్నిస్తున్నారని.. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల అభ్యున్నతికి కేసీ వేణుగోపాల్ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారని.. 2006లో ప్రారంభించిన పొంథువల్(ఎంపీ) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉందని సీఎం రేవంత్ అన్నారు.