calender_icon.png 31 August, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు కిసాన్ చేయూత

31-08-2025 02:22:23 PM

బాధితులకు అండగా ఉంటాం..

కిసాన్ షాపింగ్ మాల్ డైరెక్టర్ ధనపాల్ ఉదయ్ గుప్తా..

కామారెడ్డి (విజయక్రాంతి): అకాల వర్షంతో ఇండ్లు జలమయం కాగా కిసాన్ షాపింగ్ మాల్ వారు స్పందించారు. వారికి నిత్యావసర సరుకులు ఆదివారం అందించారు. సుమారు 500 కుటుంబాలకు కిసాన్ షాపింగ్ మాల్ డైరెక్టర్ ఉదయ్ గుప్త(Kisan Shopping Mall Director Uday Gupta) అందజేశారు. కామారెడ్డి పట్టణంలో అకాల వర్షం వల్ల నీట మునిగిన ఇండ్ల బాధితులకు ఆయన పరామర్శించి నిత్యవసర కిట్లను అందజేశారు. అనంతరం ధన్ పాల్ ఉదయ్ గుప్తా మాట్లాడుతూ, బాధితులకు ఆదుకోవాలని కిసాన్ షాపింగ్మాల్ అధినేత నిజాంబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. బాధితులకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పానని పేర్కొన్నారు. వ్యాపారమే కాక నిరుపేదలకు అండగా ఉంటూ అనే కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేపడుతున్న వారికిt అండగా ఉంటున్నామని వివరించారు. ఆయన వెంట కామారెడ్డి మేనేజర్ రాకేష్, ప్రేమ్ సిబ్బంది పాల్గొన్నారు.