calender_icon.png 31 August, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది

31-08-2025 02:05:51 PM

కామారెడ్డి బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీలు 

బాధితులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీలు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి(Kamareddy) వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్, శంకర్ నాయకులు అన్నారు. ఆదివారం కామారెడ్డి జి ఆర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ వరద బాధితులను ఎమ్మెల్సీల బృందం పరామర్శించారు. బాధితులు చెప్పిన విషయాలను విన్న ఎమ్మెల్సీల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెస్తామన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీరాజ గౌడ్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, షబ్బీర్ అలీ తనయుడు మహమ్మద్ ఇలియాస్, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్య, కవిత, లక్ష్మి, మహిళా కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.