31-08-2025 02:51:54 PM
హైదరాబాద్: దివాంగత నటుడు అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ(94) శనివారం రోజు కన్నుమూసిన విషయం తెలిసిందే. అల్లు కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమ, అభిమానులు ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అల్లు కుటుంబ సభ్యులను సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan) ఆదివారం పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా పవన్ కళ్యాణ్ నిన్న సోషల్ మీడియాలో కనకరత్నమ్మను గుర్తుచేసుకుంటూ, ఆమె తన పట్ల చాలా ఆప్యాయంగా ఉండేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. వైజాగ్‌లో జరిగిన జనసేన బహిరంగ సభ తర్వాత, పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని అల్లు నివాసానికి చేరుకున్నారు.