calender_icon.png 31 August, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల ఏర్పాటు ముఖ్యం కాదు.. ఎంత మేరకు అభివృద్ధి చేశాం అనేదే ముఖ్యం

31-08-2025 02:36:28 PM

హైదరాబాద్: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కింద నెలనెల మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చే వాళ్ళమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) అసెంబ్లీలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టణ ప్రగతి నిధులు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. ఆనాడేమో కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ అన్నారు.. ఇప్పుడేమో డబ్బులు కట్టాల్సిందేనని ప్రజల వద్ద వసూలు చేస్తున్నారని తెలిపారు. నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుందని, మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చామని గుర్తు చేశారు. అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఖర్చు పెడతామని కూడా చెప్పామని ఆయన పేర్కొన్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఇచ్చుకున్నారు.. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం ఎస్డీఆర్ఎఫ్ నిధులను ఆపేశారని తెలిపారు. ఇదేం పద్ధతి..? ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నా.. ఆ నియోజకవర్గాలు అన్నీ తెలంగాణలో భాగమే కదా.. అని పేర్కొన్నారు. ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశాం అన్నది ముఖ్యం కాదు.. మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాం, మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నారా లేదా అనేది ముఖ్యమని హరీష్ రావు అన్నారు.