31-08-2025 02:03:34 PM
చిట్యాల (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపైన రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం బీజీపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్(BJP Mandal President Burra Venkatesh Goud) ఆధ్వర్యంలో చిట్యాల పాత బస్టాండ్ ఆవరణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వెంటనే మన చిత్త వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలనీ డిమాండ్ చేశారు. అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి బిజెపి నాయకులు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మైదం శ్రీకాంత్,రావుల రాకేష్,తీగల జగ్గయ్య, చెక్క నరసయ్య,గుండ సురేష్,గజనాల రవీందర్,సాద సదానందం,చింతల రాజేందర్,అనుప మహేష్ ,సారంగపాణి, రమేష్, తీగల వంశీ, కింసారపు ప్రభాకర్, వల్లాల ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.