calender_icon.png 31 August, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయాలి

31-08-2025 04:06:06 PM

అసెంబ్లీలో ప్రసంగించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు..

కాగజ్ నగర్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో(NREGS )కింద కొంత మేరకు సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం నిర్మాణాలు జరుగుతున్నాయని సిరిపురం ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు(MLA Palvai Harish Babu) అన్నారు. ఆదివారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు కేటాయించకపోవడంతో కునరిల్లుతున్నాయి. కాగజ్ నగర్ మున్సిపాలిటీకి గత 22 నెలలుగా కనీసం 22 రూపాయలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. నిధుల లేమితో మున్సిపాలిటీలు నిర్వీర్యం అవుతున్నాయి. మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కూడా నేడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. డ్రైన్లు, సీసీ రోడ్డు పాడైతే రిపేర్ చేసే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. కావున మున్సిపాలిటీలకు సక్రమంగా నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు.