calender_icon.png 31 August, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది.. అన్నం పరబ్రహ్మ స్వరూపం

30-08-2025 05:55:38 PM

చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్

చౌటుప్పల్ (విజయక్రాంతి): అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్(Bathula Viplav Kumar Goud) అన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమమును అన్నదాతలైన బత్తుల లక్ష్మయ్య - వరలక్ష్మీ దంపతులు, బత్తుల విప్లవ్ గౌడ్ - వాణి దంపతులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందూ పురాణాల ప్రకారం, దానాల్లో ఉత్తమమైన దానం అన్నదానమని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఒకపూట భోజనం పెట్టి ఆకలితో ఉన్న వారి కడుపు నింపొచ్చు. ఇలా ఇతరుల కడుపు నింపడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారని ఈ సందర్భంగా తెలియజేశారు.

గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదానం చేయడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై యాదగిరి, గౌడ సంఘం నాయకులు అంజయ్య గౌడ్ ,బత్తుల శ్రీశైలం గౌడ్, సుర్వి నరసింహ గౌడ్, మోగుదాల రమేష్ గౌడ్, బొంగు జంగయ్య గౌడ్, ఉష్కాగుల రమేష్ గౌడ్, ఉడుగు శ్రీనివాస్ గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, వర్కాల రవి గౌడ్, సంధగళ్ల సతీష్ గౌడ్, ఉడుగు రమేష్ గౌడ్, ఉడుగు నరసింహ గౌడ్,చెరుకు లింగస్వామి గౌడ్, తొర్పునూరు రవి గౌడ్, తొర్పునూరి లింగస్వామి గౌడ్, మామిడి శివ, చెవగోని మహేష్ గౌడ్, కల్లెం నాగరాజు గౌడ్ ,అధిక సంఖ్యలో గౌడ కుల బాంధవులు, భక్తులు పాల్గొన్నారు.