23-04-2025 11:20:25 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా రామకృష్ణాపూర్ పట్టణంలో బుధవారం బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కమల, హస్తం నేతలు మాట్లాడుతూ... పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని మండిపడ్డారు. అందరం సంఘటితంగా ఉండే సమయం అని పేర్కొన్నారు. దాడిలో చనిపోయిన వారికి కొవ్వొత్తుల నివాళులర్పించడం జరిగింది. వారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు.