26-10-2025 12:05:26 AM
రొమ్ము క్యాన్సర్‌పై ఏవోఐ, హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్, బైక్ ఓ హోలిక్స్ అవగాహన
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి): అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టి ట్యూట్ (ఏవోఐ), హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్, బైక్ ఓ హోలిక్స్ సహకారంతో ’పెడల్ ఫర్ పింక్ సైక్లథాన్’ను విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్ నలుమూలల నుంచి సైక్లింగ్ కమ్యూనిటీలు, కార్పొరేట్లు, స్థానిక సభ్యులు 300 మందికి పైగా సైక్లింగ్ ప్రియులు పాల్గొన్నారు. వారికి రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించారు.
ఈ సైక్లింగ్ ర్యాలీ ఏవోఐ, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ప్రారంభమై, హైదరాబాద్ ఐటి కారిడార్ మీదగా విప్రో సర్కిల్ వరకు వెళ్లి తిరిగి హాస్పిటల్ చేరుకున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టిస్ట్, ట్రైనర్ ధాస్యం గీతా భాస్కర్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్ హాజరయ్యారు. భారతదేశంలో మహిళల ఆరోగ్య సమస్యలలో రొమ్ము క్యాన్సర్ అత్యం త ప్రధానమైనదిగా ఇది మొత్తం క్యాన్సర్ కేసులలో 28.8% మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా నిలిచింది.
నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ ద్వారా జామా(JAMA) ఓపెన్ నెట్వర్క్‌లో ఇటీవల ప్రచురించబడిన అధ్యయ నంలో హైదరాబాద్ నగరంలో రొమ్ము క్యాన్స ర్ సంభవం అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్రతి లక్ష మంది మహిళలకు 54 చొప్పున వయ స్సు -సర్దుబాటు సంభవం రేటు నమోదైంది.
మారుతున్న జీవనశైలి, ఊబకాయం, నిశ్చల అలవాట్లు, మద్యపానం, ఆలస్యంగా ప్రసవం, త్వరగా రుతుస్రావం, ఆలస్యంగా మెనోపాజ్, తల్లిపాలు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల పట్టణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ పెరుగుతున్నట్లు సూచిస్తుంది.
ముందస్తు స్క్రీనింగ్, నివారణ చర్యలు
ఈ సందర్భంగా, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ, డాక్టర్ కె.వి. కృష్ణమణి ప్రసంగిస్తూ, “రొమ్ము క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో ముందస్తు స్క్రీనింగ్, నివారణ చర్యల ప్రాధాన్యతను స్పష్టం చేశారు. “రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన కేసులలో సకాలంలో, సమర్థవంతమైన చికిత్సకు ప్రారంభ దశలోనే వ్యాధిని నిర్ధారించడం అత్యంత కీలకమైన అం శం.
హార్మోన్ల కారకాలు, మారుతున్న జీవనశైలి అలవాట్లు, అలాగే జన్యుపరమైన అంశా లు రొమ్ము క్యాన్సర్ సంభవాన్ని పెంచడానికి ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. అయినప్పటికీ, నిరంతర వ్యాయామం, సమతుల్య ఆహారం మరియు మామోగ్రఫీ ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా ఈ క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు.
ఏవోఐ స్క్రీనింగ్ ప్యాకేజీలు
ఈ సందర్భంగా ఏవోఐ.. పురుషులు, 40 ఏళ్లలోపు మహిళలు, 40 ఏళ్లు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూ డు వేర్వేరు స్క్రీనింగ్ ప్యాకేజీలను కూడా ప్రారంభించింది. ఈ ప్యాకేజీలు స్క్రీనింగ్‌ను సులభంగా అందుబాటులోకి తీసుకురావడం,
త్వరగా వ్యాధిని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన మహిళ లు క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు, మామోగ్రఫీ స్క్రీనింగ్‌లు చేయించుకోవాలని ఏవోఐ సూచిస్తోంది” అని డాక్టర్ కె.వి. కృష్ణమణి తెలిపారు.