calender_icon.png 25 October, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింత పెరిగిన బంగారం ధరలు

25-10-2025 01:22:50 AM

  1. వారంపాటు తగ్గుతూ వచ్చి మళ్లీ పెరుగుదల

హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,460

హైదరాబాద్, అక్టోబర్ 24: దీపావళి తర్వాత భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ మార్కెట్లలో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ లాభాల బాట పట్టింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 మేర పెరిగి సుమా రు రూ.1,25,460 వద్ద చేరుకుంది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.350 పెరిగి రూ.1,15,000 మార్క్‌ను తాకింది. మరోవైపు వెండి ధరలో మాత్రం పతనం కొనసాగుతున్నది.

కొద్దిరోజులుగా భారీగా తగ్గుతున్న వెండి ధర తాజాగా కిలో కు రూ.3 వేల వరకు తగ్గి సుమారు రూ. 1.71 లక్షలకు చేరుకుంది. గడిచిన వారం రోజుల్లో గరిష్ఠ స్థాయి నుంచి బంగారం ధరలు దిగివచ్చి, కొంత ఉపశమనం కలిగించాయని కొనుగోలుదారులు భావిస్తున్న తరునంలో మళ్లీ ధరలు పెరుగుదల నిరాశ కలిగించాయి. అంతర్జాతీయంగా వాణిజ్యపరమైన అనిశ్చితులు, డాలర్ విలువ హెచ్చు తగ్గులు వంటివి బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.