01-01-2026 02:15:43 AM
మునిపల్లి, డిసెంబర్ 31: మండల పరిధిలోని పెద్ద గోపులారం గ్రామ సర్పంచ్ బుడ్డ మల్లేశం బుధవారం నాడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ గా ఎన్నికైన మల్లేశంను మంత్రి అభినందించా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచులు అం దుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని సూ చించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించి అందించేందుకు కృషి చేయాలన్నారు.