01-01-2026 02:14:40 AM
అమీన్ పూర్, డిసెంబర్ 31: అమీన్ పూర్ ఐకానిక్ గ్లోబల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ బుధవారం నిర్వహించారు. ఇందులో భాగం గా ఐకానిక్ గ్లోబల్ స్కూల్ ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను అత్యంత సృజనాత్మకంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రత్యేకంగా కోర్ట్ రూమ్ కాన్సెప్ట్, స్పేస్ రూమ్, తెలుగు స్పెషల్ విభాగం, అలాగే మేడారం సమ్మక్కసారల మ్మ జాతర అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈ ప్రదర్శనలు విద్యార్థుల ఆలోచనా శక్తిని, సామాజిక అవగాహనను ప్రతిబింబించాయి. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు విద్యార్థుల ప్రతిభను ఆస్వాదిస్తూ, కార్యక్రమ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం కార్యక్రమాన్ని సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన డైరెక్టర్ కార్తిక్ పాత్ర ప్రశంసనీయమన్నారు. చైర్మన్ అమరేంద్ర మార్గదర్శకత్వంలో కార్యక్రమం అత్యంత సవ్యంగా, శోభాయమానంగా నిర్వహించబడిందని తెలిపారు.