26 March, 2026 | 2:48 AM

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

26-03-2026 12:28 AM
  1. మెస్ బిల్లులు, అద్దె, కరెంట్ బకాయిలతో సంక్షోభంలో బీసీ హాస్టళ్లు
  2. డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, మార్చి 25(విజయక్రాంతి): రాష్ట్రంలోని బీసీ కాలేజీ హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించిన మెస్ బిల్లులు, అద్దె భవనాల బిల్లులు, కరెంట్ బి ల్లులు సహా ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యు డు ఆర్ కృష్ణయ్య,  సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ  మేరకు బుధవారం  తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి బీసీ విద్యార్థులు ఎదుర్కొం టున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ కాలేజీ హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లకు సంబంధించిన మెస్ బిల్లులు గత ఆరు నెలలుగా చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.

కూరగాయలు, మాంసం, గుడ్లు, పప్పులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల సరఫరాదారులకు గత ఐదు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేస్తామని వ్యాపారులు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో కొన్ని హాస్టళ్లలో కార్యకలాపాలు నిలిచిపోవచ్చనే పరిస్థితి ఏర్పడిం దని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని చాలా బీసీ హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, అయితే దాదాపు ఎనిమిది నెల లుగా అద్దె బిల్లులు చెల్లించకపోవడంతో భవ న యజమానులు హాస్టళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పెండింగ్ బిల్లులు, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి హాస్టళ్ల నిర్వహణను సక్రమంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.