26 March, 2026 | 2:20 AM

ఏడు లక్షలు ఏటిపాలేనా..!

26-03-2026 12:32 AM

ప్రజాధనం అంటే పట్టింపు ఎందుకు ఉండదు?

నిర్లక్ష్యానికి నిలువుటద్దం జూలపల్లి అటవీ ప్రాంతం 

గతంలోనే ఫారెస్ట్ లో చెట్లను నరికి విక్రయం 

సస్పెండ్ చేసిన ఉన్నత అధికారులు 

జివిగడ్డలో మొక్కలు నాటింది తెలియదంట 

విజయక్రాంతి దినపత్రిక చేపిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ 

మహమ్మదాబాద్, మార్చి 25 : మానవ మనుగడకు వృక్షం ఎంతో తోడ్పాటును అందిస్తుందని ఉన్నత అధికారులతో పాటు ప్రతి ఒక్కరు నిత్యం చెబుతున్న మాట. మహమ్మదాబాద్ మండలం జూలపల్లి అడవిలో ని జివిగడ్డ అటవీ ప్రాంతం లో కొన్ని ఎకరాలలో గతంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో భాగంగా దాదాపు 3 వేల మొక్కలు పెట్టినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఈ మొక్కలు నాటేందుకుగాను దాదాపుగా ఏడు లక్షల పైచిలుకు నిధులను ఖర్చు చేశారు.

అనంతరం పర్యవేక్షణ మరిచి నామమాత్రం చర్యలు తీసుకోవడంతో కొన్ని మొక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. కాగా ఫారెస్ట్ అధికారులు మాత్రం అక్కడ అసలు మొక్కలే లేనట్లుగా చెబుతూ మొక్కలు నాటిన విషయం కూడా తమకు తెలియదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాఘవేందర్ చెబుతున్న సమాధానం చూస్తే ఆ ఫారెస్ట్ పై అతనికి ఏ మేరకు అవగాహన ఉందో తెలుస్తుంది.

నిరంతరం విధులు నిర్వహించే ప్రాంతంలో కనీస అవగాహన లేకుండా అక్కడ మొక్కలు నాటినట్లు తమకు తెలియదని సమాధానం ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రం పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నిర్లక్ష్యానికి నిర్లక్ష్యానికి వత్తాసు పలుకుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని జూలపల్లి గ్రామస్తులు పలువురు పేర్కొంటున్నారు. 

- ప్రజాధనం అంటే లెక్క లేదా?

పన్నులు ఏవైనా ప్రజా సంక్షేమ కోసం నిరుపేదల నుంచి ప్రభుత్వానికి చెల్లిస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నారు. ఆ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వ అధికారులు అంచనాలను రూపొందించి అమలు చేస్తుండడం ఆనవాయితీ. అలాంటిది జూలపల్లి అడవిలో గతంలో ఓ ఫారెస్ట్ అధికారి అడవిలో చెట్లను కొట్టేసి విక్రయించి రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో అతన్ని ఫారెస్ట్ ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు.

ఇదే అడవిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మొక్కలు నాటి రూ 7 లక్షల పైగా ఖర్చు చేసి తీరా ఆ ప్రాంతంలో మొక్కలు నాటలేదు ఆ విషయం తమకు తెలియదు అని వ్యవహరించడం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యానికి నిలువుద్దంలా కనిపిస్తుంది. సమగ్ర అవగాహన ఉండవలసిన అధికారులే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే ఆ అడవి ప్రాంతాన్ని కాపాడేందుకు ఎవరు అడుగులు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. 

మొక్కలు నాటినట్లు మాకు తెలియదు..

పిచ్చి మొక్కలు ఉన్నట్లు 15 లోకి తీసుకొని పూర్తిస్థాయిలో తొలగించడం జరిగింది. అక్కడ ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మొక్కలు నాటినట్లు తమకు తెలియదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మం చి మొక్కలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

రాఘవేందర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మహమ్మాదాబాద్ మండలం, మహబూబ్ నగర్