17 May, 2026 | 6:51 AM

పెండింగ్ డీఏలను విడుదల చేయాలి

21-06-2024 12:10 AM

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు టీఎన్జీవో నేతల వినతి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు బకాయి పడిన డీఏలను విడుదల చేయాలని టీఎన్జీవో నేతలు కోరారు. ఈ మేరకు గురువారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,  ప్రొఫెసర్ కోదండరాంను కలిసిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్‌ఎమ్ హుస్సేని(ముజీబ్).. డీఏలను విడుదల చేసేలా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన వారు.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ డీఏల విడుదలకు సహకరిస్తామని తెలిపారు. వారివెంట టీఎన్జీవో కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఉమాదేవి, గోవర్ధన్‌రెడ్డి, శంకర్ ఉన్నారు.