calender_icon.png 2 August, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించాలి

02-08-2025 02:30:33 AM

  1. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య
  2. చదువు సవ్యంగా సాగేట్లు చర్యలు తీసుకోవాలి
  3. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ

ముషీరాబాద్, ఆగస్టు 1(విజయక్రాంతి): రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజులు రూ.6 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. 100 బిసి కాలేజీ హాస్టళ్లు మంజూరు చేసి  గురుకులాల్లో ప్రతి తరగతిలో 20 శాతం చొప్పున సీట్లు పెంచాలని ఆయన కో రారు.

ఈ మేరకు  బిసి నిరుద్యోగ జెఎసి చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, తెలంగాణ బిసి విద్యా ర్ధి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద వందలాది మంది విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య తిథులుగా ఎంపి. ఆర్. కృష్ణయ్యతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, బిసి కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావ్ లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి గురుకులాల్లోని తరగతుల్లో 20 శాతం చొప్పున సీట్లు పెంచాలని కోరారు. కాం ట్రాక్టర్లకు 10 శాతం నుంచి 15శాతం వరకు కమీషన్లు ఇస్తున్న ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజులు చెల్లించేందుకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.  కాలేజీ కోర్స్ చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తి ఫీజు చెల్లించి ఫీజు నియంత్రణ చట్టా న్ని అమలు చేయాలన్నారు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించి సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి, దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులాల్లో సీట్లు ఇవ్వాలని డిమాం డ్ చేశారు.

సిపిఐ జాతీయ కార్యదర్శి కె.  నారాయణ మాట్లాడుతూ ఫీజులు స్కాలర్షిప్ ల బకా యిలను విడుదల చేసి, విద్యార్థుల చదువు సవ్యంగా సాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభు త్వం పై  ఉన్నదన్నారు. ఈ  సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, ఉపాద్యక్షులు గుజ్జ సత్యం, నేతలు చంద్రశేఖర్, నరేశ్ గౌడ్, నంద గోపాల్, మోదీ రాందేవ్, సుధా కర్, శివ యాదవ్, చంద్రశేఖర్, మనీష్ ఠాకూర్, సామెల్, శివ ముదిరాజ్  పాల్గొన్నారు.