02-08-2025 02:29:47 AM
పసికందు గుండె ఆపరేషన్ కోసం బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ ద్వారా అందజేత
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగష్టు 1 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు చెందిన చింతకింది శ్రీనివాస్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అతడి భార్య మాధవి జూలై 25న లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్‌లో మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువుకు ఎడమ వైపు గుండె రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల మంచి, చెడు రక్తం ఒకే నాళం ద్వారా ప్రవహిస్తోంది. జూలై 26న బిడ్డను తండ్రి కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు.
సర్జరీకి రూ.56 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కుటుంబీకులు వారి వద్ద ఉన్న బంగారం అమ్మి రూ.2 లక్షలు సమకూర్చుకున్నారు. మిగిలిన సర్జరీ ఖర్చుల కోసం వారు ఇబ్బంది పడుతుండగా బ్లడ్ డోనర్ లైఫ్ సేవర్ ఫౌండేషన్ అధ్యక్షుడు సునీల్ ధూటను సంప్రదించారు. ఫౌండేషన్ తరఫున 2 రోజులు విరాళాలు సేకరించి గురువారం కిమ్స్ ఆసుపత్రిలో శ్రీనివాస్‌కు రూ.85,300 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సునీల్ ధూట మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా ఫౌండేషన్, ఫౌండేషన్ సభ్యులు ఎప్పుడు ముందుటారు అని చెప్పారు. విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సుకిందర్, ఉమాదేవి, శ్రీనివాస్ పాల్గొన్నారు.