calender_icon.png 2 August, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్టడీలో సృష్టి డాక్టర్ నమ్రత

02-08-2025 02:31:24 AM

  1. శిశువుల విక్రయాల కేసులో ఐదు రోజుల విచారణ

నాపై కుట్ర,అన్నీ చెపుతా: నమ్రత

ఆర్మీ అధికారిపై సంచలన ఆరోపణలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి):  సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు, డాక్టర్ నమ్రత పోలీసుల కస్టడీలోకి వచ్చింది. శిశువుల అక్రమ రవాణా, నకిలీ సరోగసీ ఆరోప ణలపై ఐదు రోజుల విచారణ నిమిత్తం పోలీసులు ఆమెను శుక్రవారం అదుపులోకి తీసు కున్నారు. అయితే, వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడిన ఆమె..

తనపై కుట్ర జరిగిందని, ఓ ఆర్మీ అధికారి తప్పుడు ఆరోపణల వల్లే ఈ కేసులో ఇరుక్కున్నానని సంచలన వ్యా ఖ్యలు చేశారు. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు శుక్రవారం ఉదయం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంత రం విచారణ నిమిత్తం నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఈ ఐదు రోజుల కస్టడీలో కేసు వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను, ఆర్థిక లావాదేవీలను వెలికితీయాలని పోలీసులు భావిస్తు న్నారు. ఈ దందాలో సహకరించిన ఏజెంట్లు, ఆశా వర్కర్లు, ఇతర ఆస్పత్రుల సిబ్బంది ఎవరు? బాధితుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయల డబ్బును ఎక్కడ దాచారు? ఇప్పటివరకు ఎంతమంది శిశువులను ఈ విధంగా విక్రయించారు?

ఈ నేరంలో గాంధీ ఆస్పత్రి అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సదానందం పాత్ర ఏమిటి? అనే కోణంలో విచారణ జరిగిందని సమచారం. సంతానం లేదనే ఆవేదనతో తన వద్దకు వచ్చే దంపతుల బలహీనతనే డాక్టర్ నమ్రత పెట్టుబడిగా మార్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పిల్లలు కలగా లనే తీవ్రమైన ఆకాంక్షతో ఉన్న సంపన్న దంపతులను గుర్తించి,

వారికి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం తక్కువని నమ్మించి, సరోగసి ఒక్కటే మార్గమని మానసికంగా సిద్ధం చేసేది. సరోగసి ప్రక్రియ చేపడుతున్నట్లు నమ్మించి, వారి నుంచి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసేదని తెలుస్తున్నది. ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ఎంతో కొంత డబ్బు ఆశ చూపి, వారు కన్న శిశువులను కొనుగోలు చేసి, ఆ శిశువులనే, సరోగసి ద్వారా పుట్టిన పిల్లలుగా నమ్మించి సంపన్న దంపతులకు అంటగట్టేదని సమాచారం. ఈ అక్రమ దందా ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు.