calender_icon.png 18 December, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూప్రాన్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా సంతోష్ రెడ్డి

18-12-2025 08:41:41 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా నూతనంగా గెలిచిన ఇస్లాంపూర్ గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డిని ఇన్ఫెక్షన్ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారికంగా ఎన్నుకోవడం జరిగింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోనీ కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచుల కూడికను ఏర్పాటు చేసి వారి ప్రోద్బలంతో మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా సంతోష్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది.

వీరితో పాటు మండల ఉపాధ్యక్షులుగా చుక్క హిమబిందు శ్రీశైలంను, ప్రధాన కార్యదర్శిగా ఘనపూర్ సర్పంచ్ సబ్బని వెంకటేష్ ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తూప్రాన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు బజారు విశ్వరాజ్, సీనియర్ నాయకులు బక్క సత్యనారాయణ గౌడ్, తూప్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ మామిళ్ళ కృష్ణ, కౌన్సిలర్ పల్లేర్ల రవీంద్ర గుప్తా, కోడిప్యాక నారాయణ గుప్తా, తిరుపతి రెడ్డి, జింక మల్లేష్, నాగరాజు గౌడ్, ఉమర్, నూతనంగా తూప్రాన్ మండలంలో గెలిచిన సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, యంజాల స్వామి, దోమలపల్లి కృష్ణ, జయరాములు పాల్గొన్నారు.