16-07-2025 06:04:08 PM
కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారు ములుగు జిల్లా ప్రజలు
ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న మాట్లాడుతూ వ్యవసాయం దండుగా అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్న విధంగా చేసిందని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ములుగు జిల్లాలో యూరియా కొరత లేదు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి మాట ములుగు ప్రజలు రైతులు నమ్మొద్దని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం
రైతుల కోసం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది రైతు భరోసా ఇచ్చింది పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించింది వరి ధాన్యానికి కింటాకు 500రూపాయల బోనస్ ఇచ్చింది పకృతి వైపరీత్యాల వల్ల వంట నష్టపోతే నష్టపరిహారము అందిస్తుంది ప్రజలకు సన్న బియ్యం ఇచ్చింది రైతన్నలకు అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారుల ఉంచింది. అన్ని రకాల ఎరువు మందులను అందుబాటులోకి ఉంచిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని బిసి రిజర్వేషన్ వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి మండలి క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొంది ఆర్డినెన్స్లు తెచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.