16-07-2025 05:29:24 PM
కేయూ రిజిస్టార్ ప్రొఫెసర్ రామచంద్రం
హనుమకొండ,(విజయక్రాంతి): ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రతి వ్యక్తికి అవసరము అయిందని, విద్యార్థులు డిగ్రీ తోపాటు సాంకేతిక నైపుణ్యతపై అవగాహన కలిగి ఉండాలని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ రామచంద్రం అన్నారు. బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని భౌతిక శాస్త్ర విభాగంలో ఎల్ఈడి బల్బులు తయారు చేసే విధానంపై నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాప్ ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సమావేశానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుంకరి జ్యోతి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ మారుతున్న సమాజంపై టెక్నాలజీ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని ప్రతిదీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు పోతున్నామని, విద్యార్థులు సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకుంటే తమకు తాముగా నిలదొక్కుకోవడానికి దోహదపడుతుందన్నారు. డిగ్రీలతో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ అని ఎంబిబిఎస్ చదివినప్పటికీ వల్ల ఏదన్న ఒక ప్రత్యేక విభాగంపై ఎండి చేస్తేనే డాక్టర్ వృత్తికి ఉపయోగం ఉంటుందన్నారు. సాధారణ బిఎసి డిగ్రీతో ఉద్యోగ అవకాశాలు దొరకడం చాలా కష్టమని, కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ తో కు పరిశ్రమలు స్థాపించుకోవడానికి ఇటువంటి నైపుణ్య శిక్షణ మీకు ఎంతో దోహదపడుతుంది ఆయన విద్యార్థులకు సూచించారు.