calender_icon.png 16 July, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియాతో సత్ఫలితాలు

16-07-2025 06:09:24 PM

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ములుగు,(విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో నానో యూరియాతో సత్ప్రలితాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. బుదవారం మల్లంపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలోని స్నేహ రైతు ఉత్పత్తి దారుల కంపెనీ లిమిటెడ్ కేంద్రంలో వ్యవసాయ శాఖ,ఇఫ్కో సంయుక్త ఆధ్వర్యంలో నానో యూరియా ప్లస్, నానో డీఏపీపై (డ్రోన్ తో పిచికారి చేసే) అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని క్షేత్రస్థాయిలో డ్రోన్ ద్వారా నానో యూరియా ద్వారా పొలాల్లో వేస్తున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నానో యూరియా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నదన్నారు.

రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నానో సాంకేతికత పరిజ్ఞానంతో మొట్టమొదటిసారిగా యూరియాను ద్రవ రూపంలో తీసుకువచ్చిన ఘనత ఓ భారతీయుడిని ఇది దేశానికే గర్వకారణం అన్నారు. సత్వర ప్రయోజనం అందించే నానో యూరియా గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.   నానో యూరియా వాడకం పై రైతులకు అవగాహన కల్పించుటకు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించాలన్నారు నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. రైతు శిక్షణ కార్యక్రమాలు ప్రదర్శన నిర్వహించి నానో యురియాను ఎలా ఉపయోగించాలి రైతులకు ప్రత్యక్షంగా చూపించాలన్నారు.  నానో యూరియా వాడకం వల్ల అధిక దిగుబడి,ఖర్చు తగ్గడం,భూసార పరిరక్షణ,పర్యావరణహితం కలుగుతుందన్నారు.