calender_icon.png 27 July, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

24-07-2025 07:41:15 PM

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

అత్యవసరంలో తప్ప బయటికి రాకూడదు..

అవసరమైతే  పోలీసులకు సమాచారం అందించాలి.. 

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): జిల్లాలో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసర సమయంలో తప్ప బయట తిరగరాదని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharath Chandra Pawar) గురువారం తెలిపారు. వర్షం కారణంగా ప్రయాణ సమయంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది కావున పరిమిత వేగంతో నడపాలి, అతివేగం వల్ల వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు.

చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదని, అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటు స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదని కోరారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళరాదన్నారు. నది,నీటి వాగుల్లోకి  చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. పిల్లలను, వృద్ధులను ఒంటరిగా బయటకు పంపవద్దని చెప్పారు. జిల్లా పోలీసు శాఖ 24*7 ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందిని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని కోరారు.