25-07-2025 02:13:30 AM
కాప్రా, జూలై 24 : భారీ వర్షాల కారణం గా వర్షపు నీరు కాలువల ద్వారా సురక్షితంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలంటూ జీ హెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ అధికారులకి పిలుపునిచ్చారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్, మారుతినగర్, ద్వారకాపురి, ఐజీ కాలనీ ప్రాంతాల్లో వర్షాల నేపథ్యంలో వర్షనీటి కాలువల పరిస్థితిని సంబంధిత అధికా రులతో కలిసి ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలంతా అప్రమ త్తంగా ఉండాలని, రోడ్డుపై నడిచేప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.