25-07-2025 02:14:28 AM
రామగుండం నియోజకవర్గంలో పల్లెబాటలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్
రామగుండం, జూలై 24(విజయ క్రాంతి) తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని రామగుండం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పల్లెబాట లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు. గురువారం అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి, ఎక్లస్పూర్, పొట్యాల, విస్సంపేట, మద్దిర్యాల గ్రామంలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ పల్లెబాట కార్యక్రమం చేపట్టారు.
అనంతరం గ్రామంలో పర్యటకు వచ్చిన ఎమ్మెల్యే కు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతి ఇంటికి తిరుగుతూ వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా... లేదా అని ఆరా తీశారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు.
ఇప్పుడు ఉన్నది ప్రజా ప్రభుత్వం అని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నాకు తెలియాలని, మీ సమ సమస్యల సాధనకు నిరంతరం శ్రమిస్తానన్నారు. నన్ను గెలిపించిన మీకు రుణపడి ఉన్నానని, గ్రామంలో మౌలిక వసతుల రూపకల్పనకు శ్రీకారం చుట్టామని దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, అధ్యక్షులు, ఆయా విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయులు, ప్రజలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.