25-07-2025 02:12:44 AM
కోరుట్ల జులై 24 ( విజయ క్రాంతి) కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల బి ఆర్ ఎస్ కార్యకర్తలుగురువారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూఐటీ సెక్టార్ దిక్సూచి రేపటి తెలంగాణ అభివృద్ది ప్రదాత , ఎల్లప్పుడూ పేద ప్రజల గురించి ఆలోచించే నాయకుడు,మన పార్టీ కార్యకర్తలను,యువకులను కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుడు నిజమైన నాయకుడు మన తెలంగాణ డైనమిక్ లీడర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు డా రిశెట్టి రాజేష్, మాజీ జిల్లా రైతు సేవా సమితి అధ్యక్షులు చీటి వెంకట్ రావు ,
మైనార్టీ అధ్యక్షులు ఫహీం, తాజా మాజీ సర్పంచు లు కేతి రెడ్డి భాస్కర్, అంజయ్యా వనతడుపుల,, సందయ్య నరేష్,సత్యనారాయణ, తాజా మాజీ కౌన్సిలర్ లు ముజఫర్ అహ్మద్, పేర్ల సత్యం, యువ నాయకులు రాజకుమార్, పొట్ట సురేందర్ గంగాధర్, అర్బజ్, గేల్లా శ్రీను , విజయ్ శేఖర్, సంతోష్ తదితరులుఉన్నారు