14-08-2025 02:18:31 AM
గంటల తరబడి స్తంభించిన జనజీవనం.. పలు ప్రాంతాలు జలమయం
హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 13 (విజయక్రాంతి): వాతావరణ శాఖ హెచ్చరికల ను నిజం చేస్తూ, బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. కార్యాల యాలు ముగిసే కీలక సమయంలో దంచికొట్టిన వానతో నగరం అస్తవ్యస్తంగా మారిం ది. ముఖ్యంగా ఐటీ కారిడార్తో పాటు పశ్చి మ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో, వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ చిక్కుకుని నరకం చూశారు.
ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానకు నగర జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన రహదారులన్నీ జలమయమై, వాగులను తలపించాయి. కార్యా లయాలు, నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమ యం కావడంతో, వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని దాదాపు అన్ని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.
ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజా గుట్ట, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. కూకట్‌పల్లి, కేపీహెబీ కాలనీ, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, ప్రగతి నగర్ వంటి ఐటీ కారిడార్కు సమీప ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోని రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది.
ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ఇళ్లకు చేరేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు నానా అవస్థలు పడ్డారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో జీహెఎంసీ, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నప్పటికీ, వర్షం తీవ్రత అధికంగా ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు.
జీహెఎంసీకి చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డీఆర్‌ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి, నీరు నిలిచిన ప్రాంతాల్లో దానిని తొలగించేందుకు, ట్రాఫిక్ను నియంత్రించేందుకు శ్రమించారు. పలుచోట్ల ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించినా, వాహనాల రద్దీ కారణంగా ఫలితం కనిపించలేదు. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెఎంసీ, పోలీస్ యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు మరోసారి సూచిస్తున్నారు. డీఆర్‌ఎఫ్ బృందాలు నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
వరదలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన హైడ్రా..
కుండపోత వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న వరద కాలువలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడారు. పాతబస్తీలోని యకుత్పురా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు, నిచ్చెన సహాయంతో యువకుడిని సురక్షితంగా బయట కు తీశారు.
యాకులురాలో నివాసముండే గౌస్ (36) అనే యువకుడు, తన మేకల కోసం మేత తీసుకువచ్చేందుకు చెట్టు కొమ్మ లు నరుకుతుందగా ఈ ప్రమాదం జరిగింది. సమీపంలో ఉన్న వరద కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. భారీ వర్షాల కారణంగా కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతూ ప్రాణభయంతో కేకలు వేశా డు. గౌస్ కాలువలో కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు, సమీపంలోనే కచ్చామో రీల్లో పూడికతీత పనులు చేస్తున్న పోలీసు బృందానికి వెంటనే సమాచారం అందించారు.
హైడ్రా ఇన్‌స్స్పెక్టర్ బాలగోపాల్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువ ఉధృతి ఎక్కువగా ఉండి, లోపలికి దిగడం అసాధ్యంగా మారడంతో, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తమ వద్ద ఉన్న నిచ్చెనను కాలువ లోకి వేసి, దానిని పట్టుకోమని యువకుడికి సూచించారు. ఆ నిచ్చెన సహాయంతో గౌసు నెమ్మ దిగా ఒడ్డుకు చేర్చారు. ఈ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్‌లో రెయిన్‌బజార్ కార్పొరేటర్ వసీ, పోలీస్ సిబ్బంది వంశీ, బాల రాజు కీలకపాత్ర పోషించారు.
నిండుకుండలా జంట జలాశయాలు
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు హైదరాబాద్ మహానగరం మరోసారి జలదిగ్బంధంలో చిక్కు కుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేయగా, మూసీ ఉగ్రరూపం దాల్చింది.
మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ సహా పలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారత వాతావరణ శాఖ ఐఎండీ రాబోయే 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికార యం త్రాంగం అప్రమత్తమైంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
హిమాయత్ సాగర్ జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1763.1 అడుగులకు చేరింది. పెరిగిన ఇన్‌ఫ్లో కారణంగా అధికారులు సోమవారం రాత్రి మూడు గేట్లను ఎత్తి 3,000 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. మంగళవారం నాటికి ఐదు గేట్లను తెరిచారు. మరోవైపు, ఉస్మాన్ సాగర్ కూడా పూర్తిస్థాయి మట్టానికి చేరువలో ఉండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.
జలాశయాల నుంచి విడుదల చేసిన నీటికి, భారీ వర్షాల నీరు తోడవడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ కాజ్‌వేలను పూర్తిగా మూసివేశారు.జియాగూడ వంద అడుగుల రహదారి కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.