గ్రామ స్వచ్ఛత కొరకు ప్రజలు సహకరించాలి
27-12-2025 04:23 PM
నూతనకల్ సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్
నూతనకల్,(విజయక్రాంతి): గ్రామంలో పారిశుద్ధ్య మెరుగు కోసం ప్రజలు గ్రామ స్వచ్ఛత కొరకు సహకరించాలని నూతనకల్ గ్రామ సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్ అన్నారు. శనివారం గ్రామములోని వీధులను పర్యవేక్షించి, మురికి కాలువలను జీపీ సిబ్బందితో శుభ్రం చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని, అన్ని రంగాలలో అభివృద్ధి చేపడుతానన్నారు. ఇందుకుగాను ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచిని గ్రామపంచాయతీ కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






