27-12-2025 04:27:14 PM
నూతనకల్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గొర్రెలు, మేకలకు నిర్వహించిన నట్టల నిర్మూలన కార్యక్రమానికి తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గొర్రె కాపరులు మరియు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుండి జీవాలను రక్షించుకోవడానికి నట్టల నివారణ మందులు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.జీవాల ఆరోగ్యం పట్ల రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ యం. రవికుమార్, సిబ్బంది సాయి గోపాల్ రెడ్డి, గోపాలమిత్ర సైదులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.