27-12-2025 04:20:38 PM
నిర్మల్,(విజయక్రాంతి): వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లెప్రసీ సర్వేలో పాల్గొన్న ఆశా వర్కర్లకు సర్వే పారితోషికం డబ్బులు చెల్లించాలని కోరుతూ శనివారం ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్నికలెక్టర్ కార్యాలయం ఏవో సూర్యారావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేష్, ఆశా వర్కర్ల సంఘం నాయకులు చంద్రకళ, సుజాత, ఇంద్రమాల, తదితరులు ఉన్నారు