calender_icon.png 29 December, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తి మండల ప్రజలకు అందుబాటులో ఉచిత ఫ్రీజర్

29-12-2025 03:50:47 PM

బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు

తుంగతుర్తి,(విజయక్రాంతి): అక్షర ఫౌండేషన్, సూర్యాపేట ఆధ్వర్యంలో,  ఎస్ కె ఆర్ కన్ స్ట్రక్షన్స్ సూర్యాపేట వారి సౌజన్యంతో తుంగతుర్తి గ్రామ  పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత ఫ్రీజర్ ను తుంగతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయానికి బిజెపి రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి ఒక్కరికి సామాజిక స్పృహ కలిగి ఉండాలని, పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం పడకూడదని అనే ఉద్దేశం తో ఫ్రీజర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

వైకుంఠదామ యాత్ర వాహనం త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. తుంగతుర్తి గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఫ్రీజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇట్టి ఫ్రీజర్లను అందజేసినట్లు తెలిపారు. విద్య, వైద్యం, క్రీడలు, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న అక్షర ఫౌండేషన్ ను అభినందించారు. అక్షర ఫౌండేషన్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫ్రీజర్ కావలసిన వారు 95159 38163 మరియు 7036259922 నంబర్లలో సంప్రదించి తీసుకు వెళ్లాలని కోరారు. దహన సంస్కారాలు పూర్తి అయ్యాక ఫ్రీజర్లను తిరిగి గ్రామపంచాయతీలో అప్పగించాలని చెప్పారు. దీనితో గ్రామ ప్రజలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.