12-05-2025 12:56:35 AM
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ,మే 11: పిఏ పల్లి మండలంలోని అంగడిపేట గ్రామ ప్రాంగణంలో యశోద ఆస్పత్రి మలక్ పేట్ వారి సౌజన్యంతో పిఏ పల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి సహకారంతో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని వారుపేర్కొన్నారు.
గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఉప కేంద్రాలను నిర్మిస్తున్నాం.కార్పొరేట్ ఆసుపత్రులకి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించేందుకు కృషిచేస్తున్నానమని తెలిపారు. యశోద ఆస్పత్రి వారు కల్పిస్తున్న వైద్య సేవలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం వైద్య శిబిరంలో వైద్యులు చేస్తున్న పరీక్షలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడియా నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్,మాజీ ఎంపీపీలు వంగాల ప్రతాప్ రెడ్డి,తెర సత్యం రెడ్డి,
ఏడ్పుల గోవింద్ యాదవ్,సీనియర్ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,పాల్వాయి వెంకట్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి సతీష్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాలకృష్ణ,కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు