calender_icon.png 13 May, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కోనపురి రాములు 11వ వర్ధంతి

12-05-2025 12:54:46 AM

యాదాద్రి భువనగిరి, మే 11(విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమ నాయకుడు కోనపురి రాములు 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థూపానికి టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కోనపురి రాములు తాడిత పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన నాయకుడు అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆయన  ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం టిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ మాట్లాడుతూ కొనపురి రాములు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని యువతకు మార్గదర్శకుడు అయ్యాడని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి కోనపురి కుటుంబ సభ్యులు అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

భువనగిరి నియోజకవర్గం లోని దాసిరెడ్డి గూడెంలో తడిత పీడీతప్రజల అశాజ్యోతి, తెలంగాణ పోరుబిడ్డ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డ స్వర్గీయ శ్రీ కునపూరి రాములు గారి 11వ వర్ధంతి సందర్బంగా వారి స్థూపనికి నివాళులర్పించిన భువనగిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ క్యామ మల్లేష్.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారు, కంచర్ల రామకృష్ణ రెడ్డి గారు మరియు కునపురి కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరు పాల్గొన్నారు.