సమస్యలు పరిష్కరించండి సారు..
ప్రజావాణిలో ప్రజల విజ్ఞప్తులు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మా సమస్యలు పరిష్కరించండి సార్ అంటూ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వ్యాప్తంగా వివిధ మండలాల నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఇతర సమస్యలపై 87 మంది ప్రజలు జిల్లా అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి(District Additional Collector Veera Brahmachari)కి ఫిర్యాదులు అందజేశారు. ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించాడు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో పురుషోత్తం డిఆర్డిఏ పిడి మధుసూదన్ రాజ్, డిసిఓ వెంకటేశ్వర్లు, బిసి డెవలప్మెంట్ అధికారి నరసింహ స్వామి, డి ఏ ఓ విజయనిర్మల, పరిశ్రమల అధికారి శ్రీమన్నారాయణ, డిపిఓ హరిప్రసాద్, డిడబ్ల్యూ ధనమ్మ, డిడి గ్రౌండ్ వాటర్ సురేష్, ఆర్ అండ్ బి ఈ ఈ భీమ్లా నాయక్, ఎంప్లాయిమెంట్ అధికారి రజిత, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ మూర్తి, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.






