122 మంది రెతులపెకేసు
- దిలువార్‌పూర్ రైతులపై నమోదు చేసిన పోలీసులు
- అందులో 19 మంది మహిళా రైతులు
- మళ్లీ ఆందోళలకు సిద్ధమవుతున్న ప్రజలు
నిర్మల్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): గత నెల 26, 27 తేదీల్లో దిలువార్‌పూర్ మండల కేంద్రం వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ ఐదు గ్రామాల రైతులు చేసిన ఆందోళన రా్రష్ట్రవాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతుల డిమాండ్లను అంగీకరించడంతో ఆందోళనలు విరమించారు.
రైతుల తో ప్రభుత్వం చర్చలు జరుపగా పరిశ్రమను రద్దు చేయడంతోపాటు ఆందోళనకారులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని రైతులు డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం అంగీకరించడంతో ప్రజలు ఆందోళన విరమించా రు. ఇప్పుడు ఆందోళనలో పాల్గొన్న 122 మంది రైతులపై కేసులు నమోదు కావడం తో రైతుల్లో మళ్లీ ఆగ్రహం వ్యక్తమవుతున్న ది.
122 మందిలో 16 మంది మహిళా రైతులపై కేసులు నమోదు అయినట్టు తెలిసింది. పంట పొలాల మధ్య, గ్రామాలకు సమీపాన ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే పంట లు దెబ్బతింటాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని, జీవరాశుల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొంటూ పరివ్రమను రద్దు చేయాలని కోరుతూ ఐదు గ్రామాలకు చెందిన ఐదువేల కుటుంబాల రైతులు కుటంబ సభ్యుల తో కలిసి ఏడాది కాలంగా పోరాటం చేశారు.
అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవ డంతో గత నెల 26, 27 తేదీల్లో ఆందోళన ఉధృతం చేశారు. భైంసా జాతీయ రహదారిని 48 గంటలు దిగ్భందం చేశారు. ఆందోళన చేస్తు న్న వారిని 27న పోలీసులు అదుపులో తీసుకోవడంతో ఆగ్రహంతో రైతులు పోలీసులపై తిరగబడ్డారు. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి, పోలీసులపై దాడికి పాల్పడ్డారు.
రైతులతో చర్చలకు వచ్చిన ఆర్డీవో రత్నకళ్యాణిని ఆరు గంటలు నిర్భం దం చేయడంతో పోలీసులు ఆమెను అతికష్టం మీద ఆసుపత్రికి తరలించారు. తర్వాత కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల సమక్షంలో రైతు జేఏసీ నాయకులతో చర్చలు నిర్వహించారు. పరిశ్రమ పను లు నిలిపివేసి, రైతలపై కేసులు పెట్టబోమని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి సంబురాలు చేసుకున్నారు.
ఆర్డీవోను నిర్భందించారని ఆర్డీవో డ్రైవర్ మహ్మద్ రియాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిలువార్ పోలీసు స్టేషన్‌లో 122 మందిపై పోలీలు కేసులు నమోదు చేశారు. ఎస్సీ, కలెక్టర్ హామీలు విస్మరించి కేసులు నమోదుకావడంతో వారు మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.
అప్రమత్తమైన పోలీసులు
అటు పోలీసు శాఖ కూడా అప్రమత్తమయ్యింది. ఆందోళనలు చేసే గ్రామాల్లో ప్రజల కదలికలపై నిఘా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టింది. అయి తే ఈసారి రైతులు అధికారుల తీరుపై మరింత ఆగ్రహాంతో ఉన్నారు. పక్కా ప్రణాళికతో కేసులను రద్దు చేసే విధంగా ప్రభుత్వంపై మరో పోరుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది.






