2 May, 2026 | 7:49 PM

ఈడీకి అవినీతి తిమింగలం వివరాలు

10-12-2024 12:16 AM
  1. దాసరి నరేందర్ అక్రమాలపై ఏసీబీ నివేదిక
  2. నిజామాబాద్, హైదరాబాద్ మున్సిపల్ ఉన్నతాధికారుల్లో వణుకు!

నిజామాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాం తి): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవె న్యూ అధికారి అవినీతి బాగోతం ఈడీకి చిక్కింది. ఆగస్టు 9న ఏసీబీకి పట్టుబడిన దాసరి నరేందర్ రూ.50 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఇంట్లో తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు రూ.7 కోట్ల విలువైన నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ ఇంట్లో ఏకంగా రూ.రెండు కోట్ల తొంభైమూడు వేల కు పైగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. నరేందర్ భార్య, తల్లి ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. 51 తులాల బంగారం, రూ.రెండు కోట్ల విలువైన స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దీంతో ఈడీ అధికారులు నరేందర్ అక్రమాస్తులపై పూర్తి నివేదికను అందజేయాలని నిజామాబాద్ ఏసీబీ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ఈ మేరకు మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారులు నివేదికను అందజేసిన ట్టు తెలిసింది. దీంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఉన్నత స్థాయి అధికా రులతో పాటు హైదరాబాద్‌లో నరేందర్‌తో అంటకాగిన అధికారుల వెన్నులో వణుకు మొదలయ్యింది.

నరేందర్ మనీ లాండరింగ్ పాల్పడ్డాడా.. అనే కోణంతో పాటు అతడికి బినామీగా ఉన్నవారి వివరాలు, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌లు, వ్యవసాయ భూములు, వ్యాపా ర పెట్టుబడుల విషయమై దర్యాప్తు మొదలయినట్లు సమాచారం. 

కేసు వివరాలు నివేదించాం

ఏసీబీ పట్టుబడిని దాసరి నరేందర్ అక్రమాలపై ఈడీ నివేదికను కోరి న విషయం వాస్తవమే. కొన్ని రోజుల క్రితమే తమ వద్ద ఉన్న పూర్తి నివేదికను ఈడీ అధికారులు అందజేశాం. 

 ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్