calender_icon.png 26 July, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

35శాతం లాభాల వాటా చెల్లించాలి

25-07-2025 02:52:09 PM

ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ శైలింద్ర సత్యనారాయణ-

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి(Singareni) సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని గుర్తింపు సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు సొంతింటి పథకంపై కమిటీ నియమించి విది విధానాలు ప్రకటిస్తామని గత కార్పొరేట్ సిఅండ్ఎండీ స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యం ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు అతీగతి లేదని విమర్శించారు. రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తి సాధించి దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికుల నుండి ఇన్కమ్ టాక్స్ రూపంలో సంవత్సరానికి నాలుగునెలల వేతనాన్ని టాక్స్ రూపంలో శ్రమ దోపిడీ చేస్తున్నారని మండి పడ్డారు.

ధికారులకు చెల్లించే విధంగా పేర్క్స్ పై అలవెన్స్ లను సింగరేణి యజమాన్యం చెల్లించాలని ఆందోళనలు చేపట్టినప్పటికీ  యాజమాన్యానికి చీమ కుట్టినట్టు కూడా లేదని యాజమాన్యం తీరుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. రిటైర్డ్ కార్మికులు వైద్య సేవల కోసం చార్జీలు వసూలు చేయ రాదని, రిటైర్డ్ కార్మికులకు  బెనిఫిట్స్ త్వరగా ఇవ్వాలని, కార్మికులకు వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. గనులపై ఉన్న క్యాంటీన్లలో నాణ్యమైన టిఫిన్స్, భోజన సౌకర్యం, కల్పించాలని,  ఏరియా స్టోర్, వర్క్ షాప్ లలో క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలని. నాణ్యమైన పనిముట్లు, హ్యాండ్ గ్లోజెస్, బాట బూట్లు అందజేయాలన్నారు.కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే కార్మికులందరినీ ఒకటి చేసి ఆందోళనలు ఉదృతం చేస్తామ ని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ జాయింట్ సెక్రెటరీ కంది శ్రీనివాస్, స్ట్రక్చర్ కమిటీ సభ్యులు సివి రమణ,ఏరియా నాయకులు టేకుమట్ల తిరుపతి, ఎగ్గేటి రాజేశ్వర రావు, సుదర్శన్ రెడ్డి, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ ముల్కల వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు.