25-07-2025 02:49:41 PM
లక్షెట్టిపేట, విజయక్రాంతి: టాస్క్ ఫోర్స్ బృందం(Task Force Team) ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఎరువుల దుకాణాల్లో యూరియ నిలువలను, ఇతర అనుమానాస్పద ప్రదేశాలను ఎమ్మార్వో దిలీప్ కుమార్, వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఎస్సై సురేష్ లు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏవో శ్రీకాంత్ మాట్లాడుతూ... యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ఎరువుల నిల్వ పట్టిక ప్రతిరోజు అప్డేట్ చేయాల్సిందే అని ఫర్టిలైజర్ డీలర్లను హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఏఈఓ లు తదితరులు పాల్గొన్నారు.