8 March, 2026 | 3:43 AM

తెలంగాణ ఆణిముత్యం కౌడిపల్లి వైశాలి

08-03-2026 12:11 AM

ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కూచిపూడి నృత్యం ప్రదర్శించిన నర్సాపూర్‌వాసి 

మెదక్, మార్చి 7(విజయక్రాంతి): మెదక్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన ప్రతిభావంతురాలు కౌడిపల్లి వైశాలి ముదిరాజ్ కూచిపూడి నృత్యంలో తన ప్రతిభను చాటుతూ ఇటీవల ఇండియా గేట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో గిన్నిస్ వరల్ రికార్డ్ సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నా కూడా తన లక్ష్యం ముందుకు సాగడంలో వైశాలి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. త్వరలో మలేషియాలో జరగనున్న కూచిపూడి పోటీలలో కూడా పాల్గొని విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి, తాను పుట్టిన గడ్డకు మంచి పేరు తీసుకువస్తానని వైశాలి ముదిరాజ్ ధీమా వ్యక్తం చేసింది.అలాగే తన కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నందున మలేషియా పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందించాలని ఆమె మనస్పూర్తిగా కోరింది.

విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లా నాయకులు వైశాలి ముదిరాజును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాసాపురం నాగేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు ఇమాంపురం యాదగిరి గౌడ్, జిల్లా కోశాధికారి మంకిడి రాములు ముదిరాజ్, జిల్లా యూత్ అధ్యక్షులు రవీందర్, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు కమలయ్య గారి సురేష్ ముదిరాజ్, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు అనిల్, కౌడిపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు సురేష్, చేగుంట మండల అధ్యక్షులు కంచర్ల సిద్ధ గౌడ్, ప్రవీణ్, గౌతమ్, అన్నసాగర్ రాజు, కుమ్మరి భూషణం తదితరులు పాల్గొన్నారు.