calender_icon.png 6 January, 2026 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిక కులస్థులు అన్ని రంగాలలో ముందుండాలి

05-01-2026 11:50:03 AM

రాష్ట్ర పెరిక సంఘం నాయకుడు యర్రంశెట్టి ముత్తయ్య

జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడుగా పూజారి వెంకటేశ్వర్లు.

తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా అచ్చ నవీన్.

పాల్వంచ,(విజయక్రాంతి): పెరిక కులస్థులు అన్ని రంగాలలో ముందుండాలని పెరిక సంఘం రాష్ట్ర సంఘం నాయకుడు యర్రంశెట్టి ముత్తయ్య, ఉపాధ్యక్షుడు లక్కరసు ప్రభాకర్ వర్మ అన్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద భవానీ ఫంక్షన్ హాల్ లో పురగిరి క్షత్రియ పెరిక సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ అధ్యక్షుడుగా పూజారి వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా అచ్చా నవీన్, ప్రధాన కార్యదర్శిగా యర్రంశెట్టి నరసింహారావుతో పాటు పలువురుని నూతన కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. పెరిక సంఘం కులస్థులు విద్య, వైద్య, రాజకీయ, వ్యాపార పరంగా ముందుండాలన్నారు. అంతేకాక పెరిక కులస్థులు ఏకతాటిపై ఉంటు సంఘం బలోపేతం చేయాలన్నారు. అనంతరం హైదరాబాదుకు చెందిన కానుగంటి శ్రీను దంపతులు ఆధ్వర్యంలో జిల్లాలోని 41 మందికి 5 లక్షల విలువ విలువ గల కుట్టు మిషన్లు అందజేశారు.

అనంతరం జిల్లాలోని ఇటీవల గెలిచిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బొలిశెట్టి రంగారావు, అంకతి ఉమామహేశ్వరరావు, మల్లేషం, లక్ష్మీనారాయణ, ఆక రాధాకృష్ణ,సంఘని మల్లేశ్వర్, అంకతి వెంకట రమణ, అంకత మల్లికార్జున రావు, శ్రీనివాసరావు, సాయిని నరేందర్, కర్రె సురేందర్, నట్టె మోహన్ రావు, తిప్పని సిద్ధులు, అత్తె నరేందర్, తుమ్మటి గంగాధర్, పల్నాటి నాగేశ్వరరావు, దిడ్డి మోహన్ రావు, అత్తి లక్ష్మీనారాయణ, బెక్కం నరసింహారావు, బెడద సురేందర్, చలసాని ఉపేందర్, బొట్టు శ్రీను, బెడద నరేందర్, పడాల బలరామకృష్ణ  తదితరులు.