calender_icon.png 7 January, 2026 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీష్‌రావుకు ఊరట

05-01-2026 11:46:50 AM

హైదరాబాద్: సుప్రీంకోర్టులో హరీశ్ రావుకు(Harish Rao) ఊరట లభించింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్(Phone tapping case) కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. హరీష్‌ను నిందితుడిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రెండు పిటిషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రాధాకిషన్ రావు, హరీష్ రావుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వేర్వేరు పిటిషన్లు వేసింది. రెండు పిటిషన్లపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. పిటిషన్లపై జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో గతంలో దాఖలైన పిటిషన్ కొట్టివేసినట్లు జస్టిస్ నాగరత్న(Justice Nagarathna) గుర్తుచేసింది.

డిసెంబర్ 2024లో, మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) ఆదేశాల మేరకు సీనియర్ పోలీసు అధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేశారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఫలితంగా, పోలీసులు హరీష్, అతని వ్యక్తిగత సహాయకుడు వంశీ కృష్ణ, మరికొందరిపై కేసు నమోదు చేశారు. దీనికి ప్రతిస్పందనగా, హరీష్ తనపై మోపిన ఆరోపణలు నిరాధారమైనవని, కాబట్టి ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. విస్తృత చర్చల అనంతరం, హైకోర్టు మార్చి 2025లో హరీష్‌పై వచ్చిన ఆరోపణలను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. చక్రధర్ గౌడ్ తదనంతరం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. కానీ హైకోర్టు తన నిర్ణయాన్ని మార్చడానికి నిరాకరించింది. అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.