24-04-2025 01:36:50 AM
తుంగతుర్తి, ఏప్రిల్ 23: భూసమస్య ల శాశ్వత పరిష్కారం కోసమే తమ ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించా రు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మం డలకేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
నాటి సీఎం కేసీఆర్ కేవ లం నాలుగు గోడల మధ్య నలుగురితో కూర్చుని ధరణి పోర్టల్ సిద్ధం చేశారని, అందుకే ఆ పోర్టల్ విఫలమైందని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా అందరి ఆమోదంతో భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకువ స్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం అన్యాయంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తుందని తేల్చిచెప్పారు.
గత ప్రభు త్వంలో కబ్జాకు గురైన భూములన్నింటినీ భూభారతి ద్వారా వెనక్కి తీసు కుంటామని తెలిపారు. అక్రమ పట్టాలను కచ్చితంగా రద్దు చేసి తీరుతామ న్నారు. కొత్తచట్టంలో తహసీల్దారు నుంచి సీసీఎల్‌ఏ స్థాయి వరకు సమస్యలు పరిష్కరించేందుకు వెసులుబాటు ఉందని వెల్లడించారు.
రైతులెవరూ అధైర్య పడొద్దని, భూసమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు, కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న పాల్గొన్నారు.