calender_icon.png 15 November, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం

10-08-2024 05:02:16 AM

  1. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 
  2. కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటన 
  3. అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9(విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వ మని, ఇందిరమ్మ రాజ్యమని.. ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తగూడెం ఎమ్యేల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నా రు. లక్ష్మిదేవిపల్లి మండలంలోని అశోక్ నగర్ ప్రగతి నగర్‌లో మొర్రెడు వాగును కలుపుతూ రూ.1.50 కోట్లతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  గత పాలకుల నిర్లక్ష్యంతో ఏటా వర్షాకాలం లో కాలనీ ముంపునకు గురై ప్రజలు ఇబ్బందుల పాలవుతు న్నారని, నేటితో ఈ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు.

అనంతరం అదే మండలంలోని చాతకొండ బీలోని రేగళ్ల రోడ్డులో అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ ఆవరణలో వన మహోత్సవం, పచ్చదనం కార్యక్రమంలో వారు మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ఆ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు చిత్తశుద్ధితో ముందుకు సాగాలన్నారు. అనంతరం సమీకృత జిల్లా అధికారుల సముదాయం(ఐడీఓసీ)లో ఏర్పాటు చేసిన మహిళాశక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  ఇదిలా ఉండగా.. విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని హెచ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్, టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ మంత్రిని కోరారు. 

ట్రాక్టర్ నడిపిన పొంగులేటి

కొత్తగూడెం జిల్లా పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఖమ్మం జిల్లా ఏన్కూర్ వద్ద సీతారామ సాగునీటి ప్రాజెక్టు పనులను మంత్రి పొంగు లేటి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయనే స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ నెల 15న సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని అధికా రులను ఆదేశించారు.