calender_icon.png 15 November, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో నిందితుడి అరెస్టు

10-08-2024 04:59:50 AM

నారాయణపేట, ఆగస్టు 9 (విజయక్రాంతి): హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు 48గంటల్లోనే పట్టుకున్నారు. నారాయణపేట ఎస్పీ యోగేశ్‌గౌతమ్ శుక్రవారం విలేక రుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మూడు రోజుల క్రితం కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్ 167 కృష్ణ వంతెనపై ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పంచాయతీ కార్యదర్శి రఘుస్వామి ఫిర్యాదు మేరకు కృష్ణ ఎస్సై నవీద్, మక్తల్ సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడిని కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లా, జాకీర్ వెంకటపురం గ్రామానికి చెం దిన మహేష్‌గా గుర్తించారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడని తెలుసుకున్నారు. కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా ఖాదర్‌గుండు గ్రామానికి చెందిన అతడి బావ కృష్ణ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

మహేష్ అక్క లక్ష్మితో 2009లో కృష్ణకు వివాహమైం ది. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. లక్ష్మి, కృష్ణ తరచూ గొడవపడుతుండేవారు. ఈ క్రమంలో కృష్ణ తన భార్య ను హత్య చేసి, జైలుకు వెళ్లి, ఐదు నెలల క్రితం బెయిలుపై బయటకు వచ్చాడు. భార్య హత్య కేసు విషయంపై పంచాయితీ నిర్వహించి, తన కుమారుల పేర రెండెకరాల భూమి పట్టా చేయిస్తానని, కుమార్తెకు ప్లాటు ఇస్తానని కృష్ణ పెద్దమనుషుల ఎదుట ఒప్పుకున్నాడు. పిల్లల బాగోగులు చూసుకుంటున్న మహేష్.. భూమి విషయంపై కృష్ణను అడగగా దాటవేస్తూ వస్తున్నాడు.

దీంతో కొన్ని సందర్భాల్లో కృష్ణను చంపేస్తానని మహేష్ బెదిరించాడు. మహేష్‌ను చంపేందుకు కృష్ణ కూడా పతకం వేశాడు. ఈ నెల ఏడో తేదీన సాయంత్రం ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత తన స్నేహితుడైన మైనర్ బాలుడితో కలిసి మహేష్‌ను కృష్ణ కత్తితో పొడిచి, గొంతు కోసి చంపేశా డు. మృతదేహాన్ని ఆటోలో కృష్ణా నది వంతె న రోడ్డు పైకి తెచ్చి పడేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన కృష్ణ పోలీసులు నిందితుడ్ని శుక్రవారం(48 గంటల్లోనే) పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ తెలిపారు.